విలువ వేలల్లో, వచ్చింది లక్షల్లో... మోదీ బహుమతుల వేలంతో భారీ ఆదాయం!

ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాలు, ప్రాంతాల్లో పర్యటనలకు వెళ్లిన సమయంలో ఆయనకు కానుకలుగా వచ్చిన 1,800 పైగా వస్తువులు, మెమొంటోల వేలం తరువాత ప్రధానమంత్రి కార్యాలయం భారీగా నిధులను ఆర్జించింది. ఈ డబ్బును గంగానది ప్రక్షాళనకు చేపట్టిన 'నమామి గంగే' కార్యక్రమానికి వినియోగిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. గడచిన రెండు వారాలుగా న్యూఢిల్లీలోని నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మాడ్రన్‌ ఆర్ట్‌ ఆధ్వర్యంలో ఈ వేలం జరిగింది. చెక్కతో తయారు చేసిన ఓ బైక్ కు, నరేంద్ర మోదీ స్వయంగా గీసిన చిత్రానికి రూ. 5 లక్షల చొప్పున ధర పలికింది. సుమారు రూ. 5 వేలు విలువ ఉండే శివుని విగ్రహానికి రూ. 10 లక్షల ధర వచ్చింది. దాదాపుగా రూ. 4 వేలు విలువ చేసే చెక్కతో చేసిన అశోక స్తంభం ప్రతిరూపానికి రూ. 13 లక్షల ధర లభించింది. రూ. 2 వేలు విలువ చేసే అస్సాంలోని మజూలి సంప్రదాయ ‘హొరాయి’ని వేలం వేయగా, రూ. 12 లక్షలు వచ్చింది. రూ. 4 వేలు ఖరీదు చేసే గౌతమ బుద్ధుడి బొమ్మకు రూ. 7 లక్షల ధర లభించిందని పీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది.
Go Back to Shorts
Narendra Modi
Auction
Momentos
PMO
River Ganga
Namami Gange

More Telugu News